తల్లితండ్రులకు సత్కారం
హృదయాలను కరిగించిన ఫ్యామిలి గ్లోరి
కుటుంబ వ్యవస్థే అన్నింటికి మూలం
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని కోటారెడ్డి నగర్ శ్రీ చైతన్య హైస్కూలులో శనివారం ఫ్యామిలి గ్లోరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లితండ్రులను సత్కరించి వారి పై తమకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తల్లితండ్రులు తమ బిడ్డల ఆప్యాయతకు భావోద్యేగానికి లోనై తమ బిడ్డలను గుండెలకు హత్తుకునేటు వంటి సన్నివేశాలు మానవీయ సంబంధాలు ప్రస్ఫుటింప చేసాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సురేష్, అకడమిక్ డీన్ జి.బ్రహ్మాయ్య, సి - బ్యాచ్ ఇన్చార్జ్ శివయ్య ఫ్యామిలి గ్లోరి గురించి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలతో పాఠశాలకు , తల్లితండ్రులకు పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టి నవ సమాజ నిర్మాణానికి బలమైన శక్తులు గా ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం పలువురు తల్లితండ్రులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అనిల్ కుమార్, కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు, ఏవో సురేష్ నాయిడు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.