మొదటి సంవత్సరం డిగ్రీ ఫలితాలు విడుదల
BSBNEWS - కందుకూరు
టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) మొదటి సంవత్సరం డిగ్రీ ఫలితాలను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె. పట్టాభి రామ్ చేతుల మీదుగా సోమవారం విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రవికుమార్ తెలిపారు. కళాశాల స్వయం ప్రతిపత్తి అయిన తర్వాత విడుదల చేసిన మొట్టమొదటి ఫలితాలలో 83.40 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు సాధించడం సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థినీ విద్యార్థులని కళాశాల సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ఫలితాల్లో బి ఏ 80.95 శాతం బి ఎస్సి - 91.94 శాతం,బి కాం (comp App l) 77.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు రవికుమార్ మరియు కంట్రోలర్ ఎగ్జామ్స్ కె. శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కంట్రోలర్ ఎగ్జామ్స్ డాక్టర్ జె. హనుమంతరావు, క్లర్కు పి. రమేష్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఫలితాలు త్వరితగతిన అందించడానికి సహకరించిన వారందరికీ ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.