కేంద్ర బడ్జెట్ పై మండిపడ్డ వామపక్షాలు

0

 కేంద్ర బడ్జెట్ పై మండిపడ్డ వామపక్షాలు 

BSBNEWS - KANDUKUR 


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వామపక్షాలు మండిపడ్డాయి. స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వామపక్షాలు సిపిఐ,సిపిఎం, సిపిఎంఎల్ డెమోక్రసీ ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మన పక్క రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన వారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోడలని అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే బడ్జెట్లో దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఎంతవరకు న్యాయమని వారు విమర్శించారు. పెరుగుతున్న ధరల ప్రకారం ఆదాయం తక్కువ ఇస్తూ పలు రకాల పనులతో జనాలను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టిపీడిస్తున్నాయని వారు మండిపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మధ్యతరగ చట్టబద్ధమైన హామీ కల్పించి వ్యవసాయ మార్కెట్ జాతీయ విధానము ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపుల 50% పెంచాలని, పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టాలని, వృద్ధాప్యంలో ఇతర సామాజిక భద్రత ప్రయోజనాల కోసం కేంద్రం కేటాయింపులు పెంచాలని వారు తదితర అంశాలపై డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మాలకొండయ్య,  సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి. సురేష్ బాబు, సిపిఎం నాయకులు ఎస్ఎ గౌస్, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కే.మురళి, వై.ఆనందమోహన్, సి ఐ టి యు నాయకురాలు సల్మా, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే హుస్సేన్, సిపిఐ నాయకులు బొల్లోజుల బాల బ్రహ్మచారి, నీలిశెట్టి నరసయ్య, కోటేశ్వరరావు, ద్రోణాదుల ఆదినారాయణ, ఉప్పుటూరి మాధవరావు, సిపిఎం నాయకులు మున్ని, రాయుడు, సిపిఎంఎల్ డెమోక్రసీ నాయకులు మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)