వాహనం ఢీకొట్టడంతో గాయపడిన విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు
BSBNEWS - కందుకూరు
ఆదివారం కందుకూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికురాలు జంగిలి రోశమ్మ పట్టణంలోని మార్కెట్ సెంటర్లో పనిచేస్తుండగా 407 వాహనం ఢీకొట్టడంతో గాయపడింది. అక్కడ ఉన్న స్థానికులు ఆమెను కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ నాయకులు రోశమ్మ చికిత్స పొందుతున్న ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి పరామర్శించి వైద్యులను రోజమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోశమ్మను పరామర్శించిన వారిలో ఏఐటీయూసీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూసి సురేష్ బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనందమోహన్, ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కాకుమాని రవణమ్మ, నాయకులు పులి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.