పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిండాలి.

bsbnews
0

పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిండాలి.

BSBNEWS - కందుకూరు


పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఏఎస్పీడి, నెల్లూరు జిల్లా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ప్రత్యేకాధికారి రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్ధానిక ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరం ప్రాంగణంలో కందుకూరు డివిజన్ పరిధిలోని ఏడు మండలాలలో గల ప్రధానో పాధ్యాయులకు, ఏపి మోడల్ స్కూల్, కేజిబివిల ప్రిన్సిపాల్స్ కు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఓరియంటేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూ పకడ్బందీగా పరీక్షలు నిర్వహణ ఉండాలని సూచించారు. ఏ మాత్రమూ అలసత్వం వహించ వద్దని అధికారులకు సూచించారు. ఆర్జేడీ లింగేశ్వర రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలని, అత్యంత అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఈబి సెక్రటరీ రామ్ కుమార్, ఏఎంఓ సుదీర్ బాబు, కందుకూరు, ఆత్మకూరు ఉప విద్యాశాఖ అధికారులు నరసింహారావు, జానకిరామ్, 7 మండలాల ఎంఇఒలు, డివిజన్ లోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)