శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
భక్తులు అందుతున్న వసతులపై అధికారులతో సమీక్ష
మాలకొండలో అభివృద్ధి పనులు పరిశీలన
అన్నదాన సత్రంలో అందుతున్న భోజన సదుపాయాలపై భక్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ వేద పండితులు, అధికారులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకి వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేయాలని, అన్నదాన ప్రసాద కేంద్రంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులు పరిశీలించి అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్ బాబు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు కాకుమాని హర్ష, వడ్డెళ్ళ రవిచంద్ర, కామినేని అశోక్, ఇతర నాయకులు పాల్గొన్నారు.