టెక్నికల్ అసిస్టెంట్ సాక్షిగా మాయమైన కొలతలు

bsbnews
0

టెక్నికల్ అసిస్టెంట్ సాక్షిగా మాయమైన కొలతలు 

BSBNEWS -వలేటివారిపాలెం 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు పని కల్పించి వారిని ఆదుకోవాలని ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ ఉపాధి హామీలు కూలీలకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ప్రతినిత్యం అధికారులకు సూచిస్తుంది. అయితే వలేటివారిపాలెం మండలం పోకూరులో మాత్రం పనిలో కొలతలు ఉండవు. టెక్నికల్ అసిస్టెంట్ సైతం అక్కడ నేల గట్టిగా ఉండటం వలన కొలతలు ఇవ్వమని చెప్పటం విశేషం. అయితే కొలతలు లేకుండా ఉపాధి కూలీలకు వేతనం ఎలా ఇస్తారో అర్థం కాని ప్రశ్నగా మారింది. ఈ విషయం టెక్నికల్ అసిస్టెంట్ ను అడుగగా కొన్ని చూసి చూడనట్టు పోతూ ఉండాలి సార్ అని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. కొలతలు ఇచ్చి పని జరుగుతున్నప్పుడు ఉపాధి కూలీల వేతనం రోజు కూలి తక్కువ వస్తున్నాయి. అలాంటప్పుడు కొలతలు లేకుండా వారికి ఏ ప్రాతిపదికన వేతనాలు ఇస్తారు టెక్నికల్ అసిస్టెంట్ కే తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments
Post a Comment (0)