కోటి సభ్యత్వాలతో దూసుకుపోతున్న టిడిపి

bsbnews
0

కోటి సభ్యత్వాలతో దూసుకుపోతున్న టిడిపి 

BSBNEWS - కందుకూరు 


తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కోటి సభ్యత్వాలతో ఏ పార్టీకి లేని ప్రాభవంతో ముందుకు పోతుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ కార్డులను నియోజకవర్గంలోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లాంచనంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 50వేల పై చిలుకు దాటడం హర్షనీయమన్నారు. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉన్నదని, దీనికి సంకేతమే రాష్ట్రంలో కోటి సభ్యత్వాల నమోదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త యొక్క సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్  పునరాంకితమవుతున్నారన్నారు. ప్రమాదవశాత్తు కార్యకర్తకు జరగరానిది జరిగితే, ఐదు లక్షల బీమా సౌకర్యం ఉందని  ఆయన తెలిపారు. కార్యకర్తల బిడ్డలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నాణ్యమైన విద్య నిరంతరాయంగా అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకు, లోకేష్ బాబులకు దక్కుతుందన్నారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, తెదేపా సీనియర్ నాయకులు వడ్లమూడి సురేష్, నెల్లూరు జిల్లా టెలికం బోర్డు మెంబర్ గుర్రం మాల్యాద్రి, రఫీ, సిహెచ్ కొండయ్య, పొడపాటి మహేష్, సాయి, ముచ్చు శ్రీను, వెంకటరావు, పులి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)