రసవత్తరంగా ముగిసిన వేలం పాటలు...ఊపిరి పీల్చుకున్న అధికారులు

bsbnews
0

రసవత్తరంగా ముగిసిన వేలం పాటలు

ఊపిరి పీల్చుకున్న అధికారులు

BSBNEWS - వలేటివారిపాలెం 


మండలంలోని అయ్యవారిపల్లె గ్రామపంచాయతీ పరిధి మాలకొండలో కొలువుదీరి ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం పూర్తిస్థాయిలో వేలం పాటలు రసవత్తరంగా ముగిసాయి. దాంతో ఆలయ అధికారులు ఊపిరిపించుకున్నారు. మాలకొండలో మొత్తం 12 రకాలకు సంబంధించిన వేల పాటలు నిర్వహించాలి. అయితే ఈనెల 7వ తేదీ వేలంపాట కార్యక్రమమును ప్రారంభించగా తొలుత తల వెంట్రుకలలో పాటను గుంటూరుకు చెందిన గౌతమ బుద్ధ ప్రాజెక్టు వారు స్టీల్ టెండర్ ద్వారా రూ 2.30.10.000 కోట్లకు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 11 రకాలకు సంబంధించిన వాటికి 21వ తేదీన వేలం నిర్వహించారు అందులో మూడు పాటలకు మాత్రమే వేలం ఖరారు అయింది మిగిలిన 8 రకాల వేలంపాటలకు శుక్రవారం వేల నిర్వహించి పూర్తి చేశారు. దీంతో నెల రోజులుగా జరుగుతున్న వేలంపాటల ప్రక్రియ పూర్తవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే శుక్రవారం జరిగిన వేలం పాటలలో కొబ్బరి చిప్పల వేలంపాటను బడేవారిపాలెం కు చెందిన మహంకాళి మల్లికార్జున రూ. 19.62 లక్షలకు, పాలు నెయ్యిని రూ.50 వేల రూపాయలకు అయ్యవారిపల్లి బొచ్చు వెంగళరావు, పార్కింగ్ రుసుమును అయ్యవారిపల్లెకి చెందిన మంచాల చినవేరయ్య రూ. 28.25 లక్షలకు, వస్త్రాలను పోలినేనిపాలెం జాలరి ప్రసాదు రూ.35.45 లక్షలకు, టెంకాయలపాటను బడేవారిపాలెం మహంకాళి మల్లికార్జున రూ.26.20 లక్షలకు, పూజా ద్రవ్యాల పాటను ఇంటూరి శంకరయ్య రూ.35.33 లక్షలకు, కూల్ డ్రింక్స్ పాటను మాలకొండ కామినేని రఘు రూ. 16.75 లక్షలకు, పాదరక్షల పాటను కామినేని ఏడుకొండలు రూ. 6.10లక్షలకు స్వాధీనపరుచుకున్నారు. టిఫిన్ షాపును వంకదారి కొండయ్య రూ. 10.30 లక్షలకు, 1వ బొమ్మల అంగడిని కామినేని శివయ్య రూ. 5 లక్షలకు, మరో బొమ్మలఅంగడి పాటను కామినేని మాధవరావు రూ.4 లక్షలకు స్వాధీన పరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సుబ్బారావు డిప్యూటీ కమిషనర్ కేవీ సాగర్ బాబు తోపాటు పొడపాటి నరసింహం, తాటికొండ సింహాద్రి, ఇంటూరు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)