ఎస్టి వర్గీకరణ యానాదులకు అవసరం - యానాదుల సంక్షేమ సంఘం

bsbnews
0

ఎస్టి వర్గీకరణ యానాదులకు అవసరం
- యానాదుల సంక్షేమ సంఘం
BSBNEWS - కందుకూరు 
యానాదుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ సంఘం నాయకులు పాల్గొని ఎస్టి వర్గీకరణ యానాదులకు అవసరమని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ కు వివరించారు. ముందుగా సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకి  పువ్వుల బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐటిడిఏ  ద్వారా టు వీలర్ మోటార్ సైకిల్, వలలు, సైకిళ్లు  ఇప్పించాలని ఆమెను వారు కోరారు. పట్టణంలో సుమారుగా 450 కుటుంబాలకు పైగా సొంత ఇంటి స్థలం లేనటువంటి యానాదులకు ఇంటి స్థలాలు ఇప్పించాలని సబ్ కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు కొమరగిరి మాల్యాద్రి, ఉపాధ్యక్షులు చేవూరి దుర్గా ప్రసాద్, ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లవరపు సీత, యానాదుల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)