అక్కడ ఏటీఎం ఉన్నా లేనట్టే..
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని కోవూరు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం గత వారం రోజులుగా పనిచేయటం లేదు అని అక్కడ ఏటీఎం ఉన్నా లేనట్టేనని ప్రజలు తెలుపుతున్నారు. ప్రజల సౌకర్యార్థం ఏటీఎంలో అక్కడ ఏర్పాటు చేసినా ఎప్పుడూ సరిగా పనిచేయదని పలువురు ఎస్.బి.ఐ వినియోగదారులు తెలుపుతున్నారు. కోవూరు రోడ్డు అత్యధికముగా జన సామర్ధ్యం కలిగి, ఏటీఎం వినియోగదారులు అధికముగా వున్న ప్రాంతం దానిని గమనించి ఎస్బిఐ యాజమాన్యం అక్కడ ఉన్న ఏటీఎం పనిచేసేటట్లుగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.