ఊపిరి పీల్చుకున్న పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు
BSBNEWS - కందుకూరు
కందుకూరు నియోజకవర్గంలో మంగళవారం ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటనతో పలు పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్ళు బెంబేలెత్తాయి. ఎక్కడ మా దగ్గరికి వస్తారు అని ఏమి బయట పడతాయో అని టెన్షన్ పడ్డారు. అయితే ఫుడ్ కమిషన్ చైర్మన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉంటే అధికారులు తమ బాధ్యతలను అన్ని సక్రమంగా నిర్వర్తిస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా అని ప్రజలు బహిరంగంగా చర్చించుకున్నారు.