ముఖ్యమంత్రి కందుకూరు పర్యటనకు ఏర్పాట్లు షురూ
BSBNEWS - KANDUKUR
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15 వ తేది శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కందుకూరు పట్టణంలో పర్యటించనున్న దృష్ట్యా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్చాంద్ర కార్పొరేషన్ యం.డి అనిల్ కుమార్ రెడ్డి, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, కందుకూరు సబ్ కలెక్టర్ టి.శ్రీపూజ, కందుకూరు మున్సిపల్ కమిషనర్ కె అనూష, ఇతర అధికారులు మంగళవారం పరిశీలించారు.