రేపటి నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

bsbnews
0

రేపటి నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

BSBNEWS - కందుకూరు 

పట్టణంలోని టి ఆర్ ఆర్ జూనియర్ ప్రభుత్వ కళాశాలలో మార్చి 1వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయని టి ఆర్ ఆర్ ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వల్లి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షకు హాజరయ్యే ప్రతి ఇంటర్మీడియట్ విద్యార్థిని, విద్యార్థులు పరీక్ష రోజు 8:30 నుండి 9 గంటల లోపు విద్యార్థులను అనుమతించబడతారని అన్నారు. విద్యార్థులు ఎటువంటి భయంతోలనకు గురి కావద్దని, విద్యార్థులు మంచి అల్పాహారం తీసుకుని ఆరోగ్యంతో పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్షలు బాగా రాయాలని సూచించారు. పరీక్ష హాల్లోకి వచ్చేటప్పుడు పెన్సిల్, పెన్, స్కేల్, ఎరేజర్, హాల్ టికెట్ తీసుకొని రావాలని ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు అయిన స్మార్ట్ వాచ్, సెల్ ఫోన్స్ ఎటువంటి ఇతర వస్తువులు తీసుకురావద్దని బోర్డు కార్యదర్శి కృత్తిక శుక్ల తెలపడం జరిగిందన్నారు. 9 గంటల తరువాత వచ్చే విద్యార్థులను అనుమతించబోమని వివరించారు. విద్యార్థులు సమయపాలన పాటించాలని కోరారు. ఎవరైనా విద్యార్థులు దివ్యాంగులైతే వాళ్లకి బోర్డు వారు క్రైమ్ పర్మిషన్ను జారీ చేశారని, వారికి 30 నిమిషముల పాటు అదనంగా సమయము ఇవ్వబడుతుందని, స్క్రైబ్ గా పెట్టుకునే వ్యక్తి పదో తరగతికి మించి చదివి ఉండరాదని అన్నారు. ఈ విషయంపై సంబంధిత సెంటర్ చీఫ్ కి పరీక్ష తేదీ ముందు రోజు శుక్రవారం 28వ తేదీన తెలియచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి సూచనలు పాటించాలని కోరా రు. విద్యార్థులందరూ మంచి ఫలితాలతో బయటకు రావాలని ప్రతి విద్యార్థి మీ తల్లిదండ్రులకు మంచి పేరు  తెస్తారని ఆకాంక్షించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)