ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతాం

bsbnews
0

 ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతాం

 ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - కందుకూరు







కందుకూరు నియోజకవర్గంలో మౌళిక వసతుల కల్పన, అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత  ముఖ్యమంత్రిగా ఈ నెల 15 వ తేదిన కందుకూరు నియోజకవర్గం విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు. కందుకూరు నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో ఆదివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో  నూతన రోడ్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామంలో  సచివాలయం వద్ద కె.జి.టి రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు 70 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన బిటి రోడ్డు, సైడ్ కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు  శంకుస్థాపన చేశారు. వలేటివారిపాలెం మండలం కలవళ్ల గ్రామంలో 31.06 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 2 గోకులం షెడ్లు, నూతన సి.సి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం 2.00 కోట్ల రూపాయలు నిధులతో కలవల్ల గ్రామంలోని సచివాలయం వద్ద నుండి లింగసముద్రం మండలం వి.ఆర్ కోట వరకు నూతనంగా నిర్మిస్తున్న బి.టి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉలవపాడు మండలం ఆత్మకూరు పంచాయతీలోని కుమ్మరిపాలెం రోడ్డు నుంచి ఉలవపాడు పంచాయతీలోని కొల్లూరు గ్రామం ఎస్సీ కాలనీ వరకు 50 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న నూతన బి.టీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మొదటగా నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని, అదేవిధంగా రెండో విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఉన్న కనెక్టివిటీ రోడ్లను పూర్తి చేసి ప్రజలకు  ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించామని దానిలో భాగంగానే ఈ నూతన బి.టి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రోడ్లు సైడ్ కాలువలను ప్రాధాన్యత క్రమంలో తప్పకుండా నిర్మిస్తామని ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024లో జరిగిన ఎన్నికల్లో చారిత్రిక తీర్పు ఇచ్చి  గెలిపించారని  దానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారని గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారని,  ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమ అమలు చేస్తూనే  మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు మాదాల రవికుమార్, గోంది నరసింగరావు, సర్పంచ్ తుమ్మా కోటేశ్వరమ్మ, పోడపాటి మహేష్, సోమినేని కొండలరావు, మోదేపల్లి నారాయణ, వంకాయలపాటి మాల్యాద్రి, బెల్లం కృష్ణమోహన్, అమరనేని రాములు సర్పంచ్ నాళం గోవిందమ్మ  మండలాల్లో అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Post a Comment

0Comments
Post a Comment (0)