అందుబాటులో గుండెపోటు నివారణ ఇంజక్షన్
BSBNEWS - కందుకూరు
గుండెపోటు వచ్చినప్పుడు వేసే అత్యంత విలువైన టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని డాక్టర్ తులసీరామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లు కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు అధికంగా నమోదు అవుతున్న తరుణం లో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఒక గంట లోపు టెనెక్టెప్లస్ ఇంజక్షన్ ఇవ్వగలిగితే రోగి ప్రాణాన్ని కాపాడవచ్చు అని ఆయన తెలిపారు.దీని ఖరీరు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్ ను పేదలు కొనుగోలు చేయలేక ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు లేకపోలేదు .దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంజెక్షన్ ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అటు వంటి ఇంజక్షన్ ఇప్పుడు మన కందుకూరు ఏరియ ప్రభుత్వాసుపత్రి నందు ఉందని డాక్టర్ తులసిరామ్ వెల్లడించారు.ఈ టెనెక్టెప్లస్ ఇంజక్షన్ ఇచ్చి కందుకూరు ఏరియా హాస్పిటల్ లో ఇప్పటివరకు పదిమందికి పైగా ప్రాణాలు కాపాడడం జరిగిందని డాక్టర్ తెలిపారు.