ఘనంగా అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం

0

ఘనంగా అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం

BSBNEWS - కందుకూరు 

మండలంలోని మాచవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు గొర్రెపాటి మాల్యాద్రి అధ్యక్షతన అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో తెలుగు భాషా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ప్రాముఖ్యం  గురించి తెలియచేయటం జరిగింది. తెలుగు భాషకు వెలుగులందించిన ప్రముఖుల చిత్రపట ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మాతృభాష అయిన తెలుగు లో మాట్లాడటం మన అందరి అదృష్టం అని అన్నారు. దేశభాషలోకల్లా తెలుగు లెస్స అన్న మన ఆంధ్ర కవులు ఆనాడే చెప్పారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సైతం మాతృభాషను కాపాడుకోవాలని అనేక రకాలుగా విద్యార్థులకు అవగాహన కలిగించే కార్యక్రమాలను తీసుకుంటుందని ఆయన అన్నారు. అనంతరం మాతృభాష ప్రాముఖ్యం గురించి చక్కగా మాట్లాడిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర, విద్యార్థులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)