సిమెంట్ బల్లలు బహూకరణ
BSBNEWS - కందుకూరు
చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం అంటూ శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు (8341221414) వారి ఆధ్వర్యంలో సోమవారం శారద మెడికల్స్ నల్లమల్లి వీర వెంకట రంగ ప్రసాద్ కుమారుడు పృథ్వీష్(యు.కే) సహాయంతో ఒక బల్ల, శ్రీ సాయి సౌందర్యలహరి మందిర్ మోపాడు వారి సహకారంతో ఒక బల్లను టి ఆర్ ఆర్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లోని బాస్కెట్బాల్ కోర్టులో బహూకరించారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు, శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సేవారత్న డాక్టర్ రవ్వా శ్రీనివాసులు మాట్లాడుతూ టిఆర్ఆర్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లోని బాస్కెట్బాల్ కోర్టులో మ్యాచ్లను తిలకించడానికి వచ్చిన విద్యార్థులు మరియు క్రీడాకారులు కూర్చోవడానికి బల్లలు అవసరమని మాకు తెలియజేయగానే మేము దాతల సహకారంతో సోమవారం రెండు సిమెంట్ బల్లలను బహుకరించామని అన్నారు. ఇంకా కొన్ని బల్లలు అవసరము ఉన్నది ఇంకెవరైనా దాతలు ఉంటే మమ్మల్ని సంప్రదించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము శ్రీ కోదండ రామాలయం ఆలయాల కమిటీ సభ్యుడు గుర్రం చిన్న అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు.