అంగన్వాడీలకు పోషణపై శిక్షణ

0

అంగన్వాడీలకు పోషణపై శిక్షణ

BSBNEWS - KANDUKUR


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు వారి విధులకు సంబంధించి బాలింతలు గర్భవతులు చిన్నారులకు అందించే పౌష్టికాహారం పై అనేక రకాల కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా గత మూడు రోజుల నుండి పోషన్ బి పడాయి బి పేరుతో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా మూడవరోజు శనివారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలతో సూపర్వైజర్ షకీలా పోషణలపై శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిడిపిఓ శర్మిష్ట ఆదేశాల మేరకు పోషణ పై గర్భవతులకు, బాలింతలకు శ్రద్ధగా అవగాహన కల్పించి వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించేలా చూడాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. గత మూడు రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు పోషన్ పై శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని గర్భవతులు బాలింతలకు పట్ల వారి పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి అనే విషయం అంగన్వాడీలకు ఈ శిక్షణలో తెలియపరుస్తున్నామని వాటితో పాటు అనేక విషయాలపై శిక్షనిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)