తరాలు మారుతున్న విద్యార్థులకు చాకిరి తప్పడం లేదు
BSBNEWS - GUDLUR
తరాలు మారుతున్నా గిరిజన విద్యార్థులకు వెట్టి చాకిరి తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించేందుకు మేము అనునిత్యం శ్రమిస్తున్నామని చెబుతూ ఉన్నారు. కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు మాత్రం మనసు చెలిస్తుందని ప్రజలు తెలుపుతున్నారు. విద్యను బోధించాల్సిన వ్యక్తే గిరిజన విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తూ వారి చేత వెట్టిచాకిరి చేపిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. విషయానికి వస్తే గుడ్లూరు మండలంలోని పాజెర్ల గ్రామం ఎస్టి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శిక్షణ నిమిత్తం గత వారం రోజుల నుండి నెల్లూరు వెళుతున్న సందర్భంలో గత నాలుగు రోజుల నుండి ఆ పాఠశాలకు డిప్యూటేషన్ పై గుడ్లూరు సిఆర్పి వేదగిరి వెంకట ప్రసాదరావును వేయడం జరిగింది. అయితే అక్కడ చదువుకుంటున్న చిన్నారులకు విద్యను బోధించడం ఏమో కానీ తన చెప్పులు కడిగించుకోవడం, తాను తిన్న క్యారేజీలను కడిగించుకోవడం తో పాటుగా గత రెండు రోజుల నుండి తన యొక్క ద్విచక్ర వాహనాన్ని కూడా విద్యార్థుల చేత కడిగించుకుంటూ వెట్టి చాకిరి చేస్తున్నారు. అది గమనించిన తల్లిదండ్రులు అతన్ని ప్రశ్నించగా బండికి కొంచెం మట్టి అయితే కడుగుతున్నారండి దానికి ఏముందిలే అని చెప్పి అక్కడివారిని పంపించే ప్రయత్నం చేశాడు. విద్యను బోధించే విద్యాపకులే గిరిజన విద్యార్థుల పట్ల వారు చూపిస్తున్న వ్యత్యాసాలు చూసి సమాజాన్ని మార్చాల్సిన విద్యార్థుల భవిష్యత్తు అఘమ్య గోచరంగా మారుతుందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవటమే కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం అని, వారు చేసిన తప్పులకు విద్యార్థుల భవిష్యత్తు ఎటు పోతుందోనని భయాందోళనలో గిరిజన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేస్తున్న సిఆర్పి పై కఠిన చర్యలు తీసుకొని గిరిజన విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాట తీర్చేదిశగా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఎం ఈ ఓ వివరణ
గుడ్లూరు మండల ఎంఈఓ ను వివరణ అడగగా గుడ్లూరు మండలంలోని పాజర్ల గిరిజనులు చదువుకునే పాఠశాలకు వెళ్లడం జరిగిందని అయితే నేను వెళ్లేసరికి విద్యార్థులు స్కూటర్ కడగటం గమనించానని ఆ విషయంపై సీఆర్పీని ప్రశ్నించామన్నారు. దాంతో సిఆర్పి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారని అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వెంటనే ఆయనకు మెమోలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.