ఏరియా వైద్యశాల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్

bsbnews
0

ఏరియా వైద్యశాల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్

BSBNEWS - కందుకూరు


పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల  బ్లడ్ బ్యాంక్ నందు బ్లడ్ పాకెట్స్ సంఖ్య పెంచే విధంగా కందుకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు సహకారంతో కందుకూరు డిపో నందు కందుకూరు ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ షాజుద్దీన్ మాట్లాడుతూ కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు పెద్ద సంఖ్యలో గైనిక్ ఆపరేషన్ లు జరుగుతుండగా బ్లడ్ ప్యాకెట్స్ కోసం ఒంగోలు, కావలి బ్లడ్ బ్యాంక్స్  కేంద్రాలకు వెళ్లకుండా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు ఆదేశాల అనుసారం కందుకూరు ప్రభుత్వాసుపత్రి నందు రక్త నిలువలు సంఖ్యా పెంచే విధంగా క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. అందులో భాగంగా కందుకూరు డిపో నందు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్యాంప్ కీ సహకరించిన కందుకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస రావుకి కందుకూరు ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో 56 మంది ఆర్టీసీ కార్మికులు రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఈ బ్లడ్ డొనేషన్  క్యాంపులో కందుకూరు ఏరియా హాస్పిటల్ సిబ్బంది శ్రీలత, రామారావు, సుకుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)