రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
- కొప్పుల రాజు
BSBNEWS - నెల్లూరు
ఏఐసీసీ పిలుపుమేరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సు సిడబ్ల్యుసి శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు( రిటైర్డ్ ఐఏఎస్ ) ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం ఇందిరా భవన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొప్పుల రాజు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిని సమైక్యంగా ఉంచిన ఘనత రాజ్యాంగందేనని అటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాతలను అగౌరవంగా తూలనాడుతూ హేళనగా పార్లమెంట్లో మాట్లాడడం బిజెపి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రాజ్యాంగం లోని స్వేచ్ఛ, సమానత్వం సౌబ్రతత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాలపై ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, దాని గొప్పతనాన్ని గ్రామ మండల స్థాయికి తీసుకువెళ్లేందుకు రాహుల్ గాంధీ ఈ ఏడాది పాటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు. ఓబిసి రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు మాట్లాడుతూ దేశ సంపదంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైనదని అన్నారు. పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారని రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. డిసిసి అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి అధ్యక్షతన ఇందిరా భవన్ వన్ లో జరిగిన కార్యక్రమమునకు విద్యార్థులు, యువకులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగానికి బిజెపి, ఆర్ఎస్ఎస్ నుండి కలిగే ప్రస్తుత ముప్పుపై ప్రజలందరికీ అవగాహన కల్పించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఢిల్లీలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా జనవరి 26 నుండి 2026 జనవరి 26 వరకు ప్రారంభించబడినదని జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం జిల్లా, మండల గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా నిర్వహించబడతాయని డిసిసి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఉడతా వెంకట్రావు , ఓ బి సి రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు, యాదవ్, జిల్లా ఇంచార్జ్ ఎం గోపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నరసింహ, నెల్లూరు సిటీ ఇంచార్జ్ కిరణ్ కుమార్ రెడ్డి, ఫయాజ్ శ్రీనివాసులు రెడ్డి అనిల్ రెడ్డి కళ్యాణ్, గౌస్ మొయిద్దీన్ డాక్టర్ యశోదర,హుస్సేన్ బాషా మోహన్ రెడ్డి లీగల్ సెల్ సుధీర్, మీడియా ఇంచార్జి సంజయ్,మల్లికార్జున్ రెడ్డి, ఇర్ఫాన్, ఓ బి సి జిల్లా చైర్మన్ నరేష్, జిల్లా మైనార్టీ చైర్మన్ రెహమాన్,అల్లావుద్దీన్, ఎన్ ఎస్ యు ఐ రాజా, సేవాదళ్ సుజాత, నసీమా, భాను, రిజ్వానా, సోనీ, తదితరులు పాల్గొన్నారు.