అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి
- ఏపీ మారి టైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య
BSBNEWS - కొండపి - పొన్నలూరు
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కోరారు. మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం డివిజన్ స్థాయి అధికారుల సమీక్షా సమావేశానికి సత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే పెట్టుబడులు సాధించడంలోనూ, గ్రామాల అభివృద్ధిలోనూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ మంచి ఫలితాలు సాధించింది అన్నారు. మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. గత నాలుగు దఫాలుగా తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పారిశుద్ధ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై తప్పక చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, మండవ ప్రసాద్, కర్ణ కోటిరెడ్డి, పిల్లి వెంకటనారాయణ రెడ్డి, తహసిల్దార్ వి పుల్లారావు, ఎంపీడీవో సుజాత, తోపాటు అన్ని శాఖల అధికారులు, అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.