తలనీలాల వేలం పాట ద్వారా మాలకొండ స్వామికి భారీ ఆదాయం ఎంతో తెలుసా...?
BSBNEWS - కందుకూరు
కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం లో శుక్రవారం 2025-26 సంవత్సరానికి తలనీలాలు ప్రోగు చేసుకొను హక్కునకు నిర్వహించిన ఈ ప్రొక్యూర్మెంట్ సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నందు సీల్డ్ టెండర్ ద్వారా గౌతమ బుద్ధ ప్రాజెక్ట్స్ గుంటూరు వారు రు.2,30,10,000/- లకు దక్కించుకొన్నారు. గత సంవత్సరము కంటే 80 లక్షల పదివేల రూపాయలు అదనంగా వచ్చిందని ఆలయ ఈవో సాగర్ బాబు తెలిపారు. మిగిలిన పాటలన్నీ వాయిదా పడ్డాయని సాగర్ బాబు తెలిపారు. ఈ వేలం పాట కందుకూరు గ్రూప్స్ టెంపుల్స్ కార్య నిర్వహణ అధికారి బైరాగి చౌదరి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ స్కందపురి సోమేశ్వరాలయం ఈవో రవికుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.