సమస్యపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ కు ధన్యవాదాలు- ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి

bsbnews
0

 సమస్యపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ కు ధన్యవాదాలు

- ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి

BSBNEWS - కందుకూరు 

కందుకూరు మున్సిపాలిటీ కమీషనర్ కే అనూషని స్థానిక టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల గ్రౌండ్లో డ్రైనేజీ సమస్య ఉందని దానిని సత్వరమే పరిష్కరించాలని కోరిన వెంటనే సహృదయంతో స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించారని అందుకు మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ధన్యవాదాలు తెలిపిన వారి అధ్యాపక, అధ్యాపకేతర బృందం విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. అనంతరం కళాశాల యొక్క మేగజైన్ని, కళాశాల క్యాలెండర్ ని మున్సిపల్ కమిషనర్ కె అనూష కి అందజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)