నారాయణ ఇ టెక్నో స్కూల్ లో ఘనంగా జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు
BSBNEWS -KANDUKUR
పట్టణంలోని నారాయణ ఇ టెక్నో స్కూల్ లో జాతీయ సైన్సు దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు వారి వారి నమూణాలును బహు చక్కగా ప్రదర్శించారు. అనేక కొత్త ఆవిష్కరణలుకు, భావి ఆవిష్కరణలకు బహు చక్కగా విద్యార్థులు ఆవిష్కరించి వివరించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్. అనీష్ భాను మాట్లాడుతూ విద్యార్థులలో ప్రతిభను గుర్తించటానికి ఈ సైన్స్ దినోత్సవం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకి వారు చదువుతోపాటు వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీఎం పెద్దిరెడ్డి, క్లాస్టర్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఇ చామ్స్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, అకడమిక్ డీన్ జానీ, ఏవో అశోక్, మునీర ఆయా విభాగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.