ప్రభుత్వ శాఖల ద్వారానే ఉద్యోగ నియమాకాలు చేపట్టాలి

bsbnews
0

 ప్రభుత్వ శాఖల ద్వారానే ఉద్యోగ నియమాకాలు చేపట్టాలి

 ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పాలనే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించాలి

 సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ డిమాండ్.

BSBNEWS - కందుకూరు

ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియమకాలన్నీ ప్రైవేటు ఏజెన్సీల ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడాన్ని ఉపసంహరించు కోవాలని సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియమకాలు జరిగితే పారదర్శకత లోపించి, నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రమేయం పెరుగుతుందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా సక్రమంగా అమలు కాదని పేర్కొన్నారు. ప్రభుత్వమే నేరుగా నియమకాల ప్రక్రియ జరిపితే ఆంధ్రప్రదేశ్  కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రైవేటు ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ నియమాకాలను అప్పజెప్పితే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. నిరుద్యోగుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్ళు చేసే దళారులు తయారవుతారయ్యారని తెలిపారు. నియామకాలలో పారదర్శకత లోపిస్తుందని అన్నారు. సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదన్నారు. ప్రభుత్వం తప్పుకుని, ప్రవేట్ సంస్థలకు అప్పజెప్పడం అంటే ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి కారణం అవుతుందన్నారు. ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానంతో, సాఫ్ట్ వేర్  తో పారదర్శకంగా నియమాలు జరపటం ద్వారా త్వరగా నియమాకాలు పూర్తి చేయటం చాలా సులువు గా ఉంటుంది అని అన్నారు. ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధపడటం లేదు అని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ లేక వివిధ డిపార్ట్మెంట్లుతో, వివిధ కేటగిరీలను రకరకాలుగా ఏజెన్సీలకు ముక్కలు ముక్కలుగా విడదీసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఏజెన్సీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం అంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయటం అవుతుంది అని అన్నారు. గతంలో ఉన్న ఏజెన్సీలు పిఎఫ్ చెల్లించకుండా, ఈఎస్ఐ కట్టకుండా, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నుండి వసూళ్ళు చేసుకుని వాళ్ల సొంత అకౌంట్లలో వేసుకుని, ఉద్యోగుల డబ్బులు దోచుకుని తిన్నారని అన్నారు. పలు అక్రమాలు చేసిన వారిపై నేటికీ చర్యలు లేవని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేవారని అన్నారు. మహిళా ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉండేదని అన్నారు. దీర్ఘకాలికంగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పోరాటం చేస్తే గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఉద్యోగులందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రభుత్వ నిర్వాహణ లో నడుస్తున్న ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ను కూటమి ప్రభుత్వం మళ్లీ ఏజేన్సీలకు ఇవ్వాలని నిర్ణయం చేయటం ఉద్యోగులకు అన్యాయం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన క్యాబినెట్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రిక్రూట్మెంట్ ను నేరుగా డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలలో నింపి, నేరుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించినట్లయితే   కాంట్రాక్టు ఉద్యోగులందరిని సమీకరించి ఆందోళన చేయటానికి వెనకాడ బొమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

Post a Comment

0Comments
Post a Comment (0)