అగ్రకులస్తుల నుండి మమ్మల్ని కాపాడండి
ఎస్సీ కుటుంబం మనోవేదన
BSBNEWS - కొండేపి
కొండేపి నియోజకవర్గం చౌడవరం గ్రామంలో ఒక ఎస్సీ కుటుంబాన్ని అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తులు ఇబ్బందులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మమ్మల్ని వారి నుండి కాపాడి మాకు న్యాయం చేయాలని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బండి గోవిందమ్మ దంపతులు మీడియాను ఆశ్రయించారు. విషయానికొస్తే చౌడవరం గ్రామంలో బండి గోవిందమ్మ దంపతులు 50 సంవత్సరాలుగా గ్రామంలో నివాసం ఉంటున్నారు. వారికి ప్రభుత్వం కేటాయించి ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఉత్తరాభాగాన రోడ్డు ఉంది. అయితే ఆ రోడ్డుకు ఆనుకొని అగ్రకులానికి చెందినవారు పొగాకు బ్యార్నీలు నిర్మించుకొని ఉన్నారు. అయితే అగర్ కులానికి చెందినవారు తమ బ్యాడ్నీలను పడగొట్టి పక్కన ఉన్న స్థలాన్ని సైతం ఆక్రమించుకొని కొత్తగా పెద్ద బార్ ని కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఎస్సీ కులానికి చెందిన బండి గోవిందమ్మకు దారిగా ఉన్న స్థలాన్ని వారు ఆక్రమించాలని ప్రయత్నాలు చేశారు అయితే మేము నడిచేందుకు దారి లేదని అడ్డుకు తగిలిన బండి గోవిందమ్మ కుటుంబాన్ని ప్రతినిత్యం మనోవేదనతో పాటుగా భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్నారని బండి గోవిందమ్మ ఆవేదన వ్యక్తం చెందింది. ఈ విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దృష్టికి తీసుకొని వెళ్లగా వారు రంగంలోకి దిగి నిజ నిజాలను తెలుసుకొని బండి గోవిందమ్మకు ప్రభుత్వం వారు ఇచ్చిన అన్ని ఆధారాలు ఉన్నాయని అగ్రకులానికి చెందిన వారికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా వీరిని భయభ్రాంతులను గురి చేస్తున్నారని నిర్ధారణ చేసుకొని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న వీఆర్వో బండి గోవిందమ్మను ఇబ్బందులు పెడుతున్న వారికి బంధువు కావడంతో సమస్య పరిష్కారం కాలేదు. అగ్రకులానికి చెందినవారు బండి గోవిందమ్మ కుటుంబానికి ఇబ్బంది కలిగించినప్పుడల్లా సదరు పోలీస్ స్టేషన్ సైతం ఆశ్రయించిన న్యాయం జరగటం లేదని బండి గోవిందమ్మ తెలుపుతున్నారు. వారు నడిచేందుకు వీలుగా లేకుండా చెందినవారు గణేష్ రాలను ఇంటికి అడ్డంగా వేసి వారి బయటికి నడిచేందుకు వీలు లేకుండా నిర్బంధించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాలాలు మారుతున్న అగ్రకులాల వారి చేతిలో ఎస్సీ, ఎస్టీ కులాలు బానిసలుగా బతకాల్సిందేనా అని పలు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నారు. అటువంటి సందర్భంలో ఆ ఎస్సి కులానికి చెందిన బండి గోవిందమ్మ కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.