పోషణ్ బి పై అంగన్వాడీలకు శిక్షణ

0

పోషణ్ బి పై అంగన్వాడీలకు శిక్షణ 

BSBNEWS - KANDUKUR



కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు వారి విధులకు సంబంధించి బాలింతలు గర్భవతులు చిన్నారులకు అందించే పౌష్టికాహారం పై అనేక రకాల కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా గత మూడు రోజుల నుండి పోషన్ బి పడాయి బి పేరుతో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం చేపట్టింది. శనివారం మండలంలో అంగన్వాడి కార్యకర్తలతో సూపర్వైజర్ యు ప్రభావతి ప్రతిజ్ఞ చేపించి వారికి పోషణలపై శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరల్డ్ విజన్ మేనేజర్ యశియా పాల్గొని వారికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిడిపిఓ శర్మిష్ట ఆదేశాల మేరకు పోషణ పై గర్భవతులకు బాలింతలకు శ్రద్ధగా అవగాహన కల్పించి వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించేలా చూడాలని ఆయన అన్నారు. సూపర్వైజర్ యు ప్రభావతి మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు పోషన్ పై శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని గర్భవతులు బాలింతలకు పట్ల వారి పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి అనే విషయం అంగన్వాడీలకు ఈ శిక్షణలో తెలియపరుస్తున్నామని వాటితో పాటు అనేక విషయాలపై శిక్షనిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 51 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారని, శిక్షణ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నారని తెలిపారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)