కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించిన వామపక్షాలు

0

కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించిన వామపక్షాలు 

BSBNEWS - కందుకూరు 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పి. మాలకొండయ్య మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో కొనుగోలు శక్తి కుచించుకు పోయినందున ఆర్థిక వ్యవస్థలో తగ్గిన డిమాండ్ సమస్యను పరిష్కరించడానికి బదులు అందుకు విరుద్ధంగా మోడీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇవ్వడం, ఖర్చుల్లో కోత పెట్టడం గమనార్హం. నిరుద్యోగ సమస్యను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని, ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమంపై పెట్టిన ఖర్చు గత ఏడాది కంటే బాగా తగ్గిపోయిందన్నారు. అవసరం ఉన్నప్పటికీ ఉపాధిహామీ పథకానికి నిధులు అదనంగా కేటాయించలేదని మండిపడ్డారు. ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుదలతో అనేక ఇబ్బందులు పడుతున్న కార్మిక వర్గాన్ని ఈ బడ్జెట్ విస్మరించిందని విమర్శించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్ ఎ గౌస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మోహన్ లు మాట్లాడుతూ ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22 శనివారం సాయంత్రం 4 గంటలకు కందుకూరు లోని ఎన్జీవో హోమ్ నందు జరుగు సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి.సురేష్ బాబు, షేక్ హుస్సేన్, మురళి, సిఐటియు నాయకురాలు సల్మా, మల్లిక తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)