రహదారి భద్రతపై అవగాహన
BSBNEWS - కందుకూరు
36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం పట్టణంలోని పామూరు రోడ్డు జంక్షన్ నందు కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి టివిఎన్ లక్ష్మీ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై పలు వాహనచోదకులకు, కందుకూరు టాక్సీ స్టాండ్ ఓనర్, డ్రైవర్ సోదరులను రవాణా శాఖ కార్యాలయం నందు రహదారి భద్రత పై అవగాహన కల్పించారు. అవగాహన కల్పించడం జరిగినది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ యొక్క ప్రాధాన్యత, కారు నడుపు నప్పుడు సీట్ బెల్ట్ ధరించుట వలన కలుగు ప్రయోజనముల గురించి వివరించారు. మద్యం సేవించి వాహనమును నడుపు రాదని, తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించే వాహనమును నడుపవలెనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ చెన్నూరి రాంబాబు, నెల్లూరు ఎన్ఫోర్స్మెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి గోపి నాయక్, తదితరులు పాల్గొన్నారు.