నాణ్యమైనవిగా నిర్ధారించిన ఎరువులకు వేలంపాట
BSBNEWS - కందుకూరు
స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని ఇంటిగ్రేటెడ్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్ లోఎరువుల వేలం కార్యక్రమంను కందుకూరు వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ పి. అనసూయ ఆధ్వర్యంలో గురువారం జరిగిoది .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 2021 నుండి మార్చి 2024 దాకా పరీక్ష చేయబడి నాణ్యమైనవిగా నిర్ధారించబడిన ఎరువులను వేలంపాట నిర్వహించామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సిహెచ్ ప్రభాకర్ తండ్రి మాలకొండయ్య అనే రైతు గరిష్టంగా 850 రూపాయలు పాడినందున అతనికి ఎరువులను 93.7 కేజీల ఎరువులను అప్పగించడం జరిగింది అని అన్నారు.(యూరియా 31 కేజీ, డిఏపి 6.4 6 కేజీలు , పొటాష్ 2.5 కేజీలు , ఎంపీ కాంప్లెక్స్ 20.12 కేజీలు, ఎన్ పి కే కాంప్లెక్స్ 8.6 కేజీలు ,SSP 25.5 6 కేజీలు మొత్తం 93.7kg లు వేలం పాట నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కందుకూరు టెక్నికల్ ఏవో సిహెచ్ విఎల్ దుర్గ, ల్యాబ్ ఏవో వి.గీత ప్రకాష్, ఏ ఈ ఓ లు కే హర్షవర్ధన్, ఎం.హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.