సక్షమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
BSBNEWS - కందుకూరు
ఒంగోలులోని రెడ్ క్రాస్ రక్త నిధి నందు రక్త నిల్వలు బాగా తక్కువగా ఉన్నందున వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో సోమవారం ("రక్త దాతల వాట్స్ ఆప్ సమూహము") మరియు "సక్షమ్" ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం జరిగింది.కందుకూరు డిఎస్పీ సి హెచ్ వి బాల సుబ్రహ్మణ్యం రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. ఒంగోలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారు రక్త సేకరణ చేశారు. ఈ సందర్భంగా కందుకూరు రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ చన్నా వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ రక్త దానం యువత యొక్క సామాజిక బాధ్యత. ప్రతి యువకుడు తన ఫోన్ బుక్ లో స్నేహిహితుల పేర్లు తమ బ్లడ్ గ్రూప్ తో కలిపి పెట్టుకోండి, మీ పుట్టినరోజులు, అభిమాన నటుడి పుట్టిన రోజు మీ పెళ్ళి రోజు,ఇలా అది ఏదైనా గాని మీ ఆనందాన్ని మీ రక్త దానం తో చేస్తే మంచి అనుభూతులే కాక మీ రక్త దానం తో ప్రాణాపాయం నుండి బయటపడ్డ వారి ఆశీస్సులు కూడా వుంటాయి అని అన్నారు.ఈ శిబిరంలో ప్రకృతి వ్యవసాయ శాస్త్ర వేత్త నల్లూరి ప్రసాద్ దంపతులు రక్త దానం చేశారు.ఈ కార్యక్రమం లో రక్త దాతల వాట్స్ ఆప్ గ్రూప్ అడ్మిన్ పూరిపర్తి శ్రీనివాస రావు,జర్నలిస్టు బొజ్జా చంద్ర మోహన్,కానిస్టేబుల్ కనపర్తి మల్లికార్జున ఓరుగంటి రమేష్ , చన్నా రంగనాయకులు గుప్తా తదితరులు పాల్గొన్నారు.