చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి భారీ ర్యాలీ
BSBNEWS - కందుకూరు
చత్రపతి శివరాజ్ మహారాజ్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో శ్రీ స్కంద పురి ఉద్యానవనం పక్కన ఉన్న బజరంగీ సెంటర్ వద్ద నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా పామూరు రోడ్డు సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శివాజీ మహారాజ్ కి జై అంటూ హిందూ బంధువులందరూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరు ఆర్ఎస్ఎస్ ఖండ సంచాలక్ డాక్టర్ తన్నీరు మల్లికార్జునరావు మాట్లాడుతూ నేడు సనాతన హిందూ ధర్మం, హిందూ దేవాలయాలు ఉన్నాయంటే అది కేవలం చత్రపతి శివాజీ మహారాజ్ పుణ్యమే అని అన్నారు. మనదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన దేశాన్ని ప్రేమించాలని, మన దేశంలో ఉంటూ ఇతర దేశాల్ని ప్రేమించి, మన దేశాన్ని ద్వేషించే వాళ్లు వారికి నచ్చిన దేశాలకు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. ఈ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న బాలుడు వేసిన శివాజీ వేషం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కందుకూరు బిజెపి నాయకులు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందువులు పాల్గొన్నారు.