నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా కి అభినందనలు తెలిపిన పెన్
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపి) గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా ను ' పెన్'జాతీయ సంఘం నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) న్యూఢిల్లీ సంఘ కార్యదర్శి బడే ప్రభాకర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) సంఘ నేతలు అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మంగళగిరి లోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం సాయంత్రం డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 'పెన్ ' రాష్ట్ర సంఘ నేతలు తాడి రంగారావు, అర్జ శ్రీధర్, టివి రంగారావు , టీవీ శ్రీనివాస్, విజయ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.