భక్తిశ్రద్ధలతో లక్ష తులసి పూజ
BSBNEWS -కందుకూరు
పట్టణంలోని పెద్ద బజారులో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో సోమవారం ఆలయ అర్చకులు వేద పండితులు శ్రీరామచంద్రాచార్యులు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో, ఎంతో వైభవంగా, కన్నుల పండుగ శ్రీ సీతా సమేత కోదండ రామునికి లక్ష తులసి పూజ నిర్వహించారు. మహిళా భక్తులు రామనామ మాలపిస్తూ తులసీ దళాలను స్వామివారికి అందజేశారు. మహిళా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం, భక్తి పాటలు ఆలపించారు. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మార్మోగింది. స్వామివారిని తులసి దళాలతో కన్నుల పండుగ అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు రామచంద్రాచార్యులు మాట్లాడుతూ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసీ దళాలతో స్వామివారికి పూజించటం వలన శ్రీ కోదండ రాముని ఆశీస్సులు కందుకూరు ఆర్యవైశ్యులకు, కందుకూరు నగర ప్రజలకు ఉంటాయని ఆయన అన్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మురారిశెట్టి వెంకట సుబ్బారావు, ఆలయ ప్రధాన కార్యదర్శి మురారిశెట్టి శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.