టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓపెన్ డే కార్యక్రమం
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి) నందు గురువారం ఇంటర్మీడియట్ కళాశాలల సిబ్బందికి, విద్యార్థినీ విద్యార్థులకు ఓపెన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు గల సౌకర్యాలు, విద్యార్థుల యొక్క నైపుణ్యాల మెరుగుదల కోసం చేపడుతున్న కార్యక్రమాల్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో అత్యున్నత విద్యార్హతలు గల అధ్యాపకులు, మెరుగైన అవస్థాపన సౌకర్యాలు, లాబరేటరీ సౌకర్యాలు, విశాలమైన క్రీడాస్థలం ఉన్నాయని, విద్యార్థులను ఉద్యోగాలకి సిద్ధం చేసి తమ కళాశాల నుంచి పంపడం తమ లక్ష్యమని ప్రిన్సిపాల్ వివరించారు. చుట్టుపక్కల జూనియర్ కళాశాల విద్యార్థుల్ని తమ కళాశాలలో చేరే విధంగా సహకరించాలని వారిని అభ్యర్థించారు. ప్రిన్సిపాల్ ప్రజెంటేషన్ తర్వాత జూనియర్ కళాశాల సిబ్బంది టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణమంతా కలియతిరిగి కళాశాలలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, పొన్నలూరు, సింగరాయకొండ, టంగుటూరు, చుండి, వలేటివారిపాలెం జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండల నరేంద్ర, అధ్యాపకులు డాక్టర్ కే సుజాత, డాక్టర్ కె వి పద్మావతి, డాక్టర్ పి రాజగోపాల్ ,డాక్టర్ ఎన్వి శ్రీహరి మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.