మైనర్ మీడియా ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను కాపాడండి

0

మైనర్ మీడియా ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను కాపాడండి

BSBNEWS - లింగసముద్రం 

మండలంలోని పెద్దపవని గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాలను బాలుర జిల్లా పరిషత్ హై స్కూల్  పెద్ద పవనిలో 6,7,8 తరగతుల విలీనం చేయకుండా మైనర్ మీడియా ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను కాపాడండి అని ఎస్ఎంసి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపవని గ్రామంలో ఎంపీ యుపిఎస్ ఉర్దూ పాఠశాల 1947 వ సంవత్సరంలో స్థాపించబడింది అని, ఈ పాఠశాల స్థాపన కొరకు ఆనాటి పూర్వ గ్రామ పెద్దలు ఎంతో కష్టపడి స్థాపింప చేశారన్నారు. గత కొన్ని సంవత్సరముల నుండి ఈ పాఠశాలలో గతంలో నుండి ప్రస్తుతం వరకు ఎంతో మంది ఉపాధ్యాయులు కష్టపడి అభివృద్ధి చేశారన్నారు. ఇలా అభివృద్ధి చెందుతున్న పాఠశాలను 117 సవరణ ఉత్తర్వుల ప్రకారం పాఠశాలను ప్రస్తుతం ఉన్న విధంగానే ఎస్ఎంసి, గ్రామ పెద్దల సూచనల ప్రకారం పాఠశాలను కొనసాగించవలసిన అవసరం ఉన్నదని నిబంధనలలో ఉన్నదన్నారు. ప్రభుత్వం కూడా ఎస్ఎంసి సభ్యుల తీర్మానం ప్రకారంగానే పాఠశాలను కొనసాగించాలని తెలిపారు. ప్రస్తుతం లింగసముద్రం మండలంలో పనిచేస్తున్న మండల విద్యాశాఖ అధికారులు ఎస్ఎంసి, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా సవరణ ఉత్తర్వులకు విరుద్ధంగా ఆ మైనర్ మీడియా ఉర్దూ పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా కొనసాగించకుండా ఈ పాఠశాలలోని 6,7,8 తరగతులన బిజడ్పిహెచ్ఎస్ లోకి విలీనం చేయటం జరిగినదన్నారు. పెద్ద పవని గ్రామంలో 400 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. మండలంలోని ఒకే ఒక్క ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాల పెద్ద పవని నందు మాత్రమే కలదన్నారు. ఈ పాఠశాలలోని 6,7,8 తరగతులను విలీనం చేయడం వలన విద్యార్థులు మాతృభాష బోధనకు ఆటంకం ఏర్పడి ముస్లిం బాలికలు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదన్నారు. ఈవిషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి ప్రస్తుతం ఉన్న విధంగానే ప్రాథమికోన్నత పాఠశాలను కొనసాగించవలసిన అవసరం ఉన్నదని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్దపవని గ్రామ మాజీ సర్పంచ్ సయ్యద్ నాయబ్ రసూల్, ఎస్ఎంసి చైర్మన్ ఉబేదుల్లా, కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)