మాకు బ్రిడ్జి నిర్మాణం కావాల్సిందే
BSBNEWS - కందుకూరు
కందుకూరు నుండి కొండముడుసుపాలెం వెళ్లే దారిలో జరుగుతున్న హైవే బ్రిడ్జి నిర్మాణం మాకు కావాల్సిందే అని కొండముడుసు పాలెం గ్రామస్తులు తెలిపారు. గురువారం నేషనల్ హైవే అధికారులు హైవే పనులు పరిశీలనలో భాగంగా కొండముడుసుపాలెం గ్రామ పెద్దలను, నాయకులను పిలిపించి వారితో చర్చలు జరిపారు. బ్రిడ్జ్ నిర్మాణం కాకుండా ముందు భాగంలో ఉన్న సత్తా పై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేలా పనులు చేపడతామని వారు చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహించి మాకు బ్రిడ్జి నిర్మాణం కావాల్సిందేనని లేనిపక్షంలో ఆందోళన చేసి ప్రమాదాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడుకుంటామని వారు హెచ్చరించారు. దాంతో చేసేది ఏమీ లేక అధికారులు మీ అభిప్రాయాలను పై స్థాయికి తీసుకుని వెళ్లి బ్రిడ్జి నిర్మాణం జరిగేలా చూస్తామని చెప్పి వెనుదిరిగారు.