శ్రీ మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించికున్న ఎంపీ కలిశెట్టి

bsbnews
0

శ్రీ మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించికున్న ఎంపీ కలిశెట్టి

BSBNEWS - వలేటివారిపాలెం


మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీలో మాలకొండ గ్రామంలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని  విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నాడు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం స్వామివారి శేష వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ప్రజాప్రభుత్వం (కూటమి) ఏర్పాటు జరిగేలా ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ లకు ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలు, విజయనగరం పార్లమెంట్ పరిధిలో గల ప్రజలు క్షేమంగా ఉండాలని, అభివృద్ధి చెందేలా దీవెనలు అందించాలని శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని వేడుకున్నానని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్ బాబు, వలేటివారిపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)