మాచవరం హై స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
BSBNEWS - KANDUKUR
మండలంలోని మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జి మాల్యాద్రి ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువులకు ఎంతో ఖర్చు చేస్తుందని దానికనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి ఉన్నత చదువులకు బాటలు వేయాలని ఆయన అన్నారు. మాచవరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు గ్రామస్తులు నాయకుల సహకారం ఎంత ఉందని వారి సహకారంతో విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయులు శ్రమిస్తూ నా ఆశయానికి తోడుగా ఉంటున్నారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మార్చిలో జరిగే పదవ తరగతిలో మావిద్యార్థులు మంచి ప్రతిభను చూపించి మంచి ర్యాంకును తీసుకురావడం జరుగుతుందని ఆకాంక్షించారు. మాచవరం గ్రామానికి చెందిన ఎడ్ల మనీష్ రెడ్డి ఎంతో మంచి హృదయంతో పదవ తరగతి చదివే విద్యార్థులకు అట్టలు పెన్నులు అందించి వారి పరీక్షలకు సహకరించినందుకు వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిరంజీవి రెడ్డి, మహేంద్ర, సాదినేని మాల్యాద్రి, ఎంపీటీసీ-1 కె.శ్రీనివాసుల రెడ్డి, ఎంపీటీసీ-2 కోటేశ్వరరావు, ఎస్ఎంసి చైర్మన్ ఎన్.సుధీర్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.