మాజీ మున్సిపల్ చైర్మన్ టిడిపిలో చేరిక

bsbnews
0

మాజీ మున్సిపల్ చైర్మన్ టిడిపిలో చేరిక

BSBNEWS - కందుకూరు

కందుకూరు మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి మాలకొండయ్యని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బూర్సు మాలకొండయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విధి విధానాలు, ప్రజల కోసం ప్రభుత్వం పడుతున్న కృషి కి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర అభివృద్ధికి నచ్చి పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి  నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ ప్రజల కోసం వారి అభ్యున్నతి  కోసం చేస్తున్న కృషికి అనేకమంది మన పార్టీ వైపు వస్తున్నారని అన్నారు. కష్టపడి పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)