మాకు రావలసిన వేతనాలు, పీఎఫ్ బకాయిలను చెల్లించండి

bsbnews
0

మాకు రావలసిన వేతనాలు, పీఎఫ్ బకాయిలను చెల్లించండి

BSBNEWS - కందుకూరు

ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న మాకు వెంటనే వేతనాలు చెల్లించాలని ఆగి ఉన్న పీఎఫ్ బకాయిలు వెయ్యాలని సోమవారం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాల బయట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూసి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ కాలయాపన చేస్తున్నారని, వారికి రావలసిన పిఎఫ్ బకాయిలు సైతం మూడు సంవత్సరాల ఆరు నెలల నుండి ఇవ్వకపోవడం సరైనది కాదని వారికి కావలసిన వేతనాలు పీఎఫ్ బకాయిలు చెల్లించేంతవరకు ఏఐటీయూసీ పారిశుద్ధ కార్మికులతో కార్యాచరణ రూపొందించుకొని పోరాటానికి దిగుతుందని ఆయన హెచ్చరించారు. నిరుపేదలైన పారిశుద్య కార్మికులు జీతాలు రాకపోవడంతో అప్పులపాలై ప్రతినిత్యం ఆకలి పోరాటం చేస్తున్నారని, దీనిని గమనించి వారి కి రావలసిన బకాయిలను త్వరగా చెల్లించాలని కోరారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వస్తున్న ప్రజలకు అనునిత్యం సేవలు చేసేది ఈ పారిశుద్ధ కార్మికులను అటువంటి పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురి చేయటం సరికాదని ఆయన అన్నారు. అనంతరం ఏరియా వైద్యశాల సూపరిండెంట్ శకుంతలను కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన సూపరిండెంట్ కాంట్రాక్టర్ తో మాట్లాడటం జరిగిందని త్వరలోనే వారికి రావలసిన బకాయిలను అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనందమోహన్, ఏరియా వైద్యశాలలోని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)