వీధి దీపాలకు మరమ్మత్తులు
BSBNEWS- కందుకూరు
మండలంలోని కోవూరు పంచాయతీలో వీధి దీపాలకు సర్పంచ్ ఆవుల మాధవరావు సోమవారం మరమ్మత్తులు చేపట్టారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ వీధి దీపాలు మరమ్మతులకు గురై వీధి దీపాలు వెలగడం లేదని గుర్తించడం జరిగిందని, రాత్రి వే ళల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీధి దీపాలు మరమ్మతులు చేయడం జరిగిందని అన్నారు. పంచాయతీలోని అన్ని గ్రామాల ప్రజలుకు అందించే వసతుల విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని, గ్రామంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కరించేలా చూస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.