శాకవరంలో పొగాకు క్షేత్ర దినోత్సవం

bsbnews
0

 శాకవరంలో పొగాకు క్షేత్ర దినోత్సవం

BSBNEWS - వలేటివారిపాలెం

పొగాకు బోర్డు కందుకూరు రెండవ వేలం కేంద్రం పరిధిలోని  శాకవరం గ్రామంలో సిరి, ఎఫ్ సి ఆర్ -15 వంగడాల మద్య ఉత్పత్తి, నాణ్యత లో పోలిక అనే అంశం మీద  రైతులకు , సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేలం నిర్వహణ అధికారి చంద్ర శేఖర్ మాట్లాడుతూ అడుగు ఆకులు వొదిలేసి పక్వానికి వచ్చిన వాటిని మాత్రమే రెలచాలి అని అన్నారు. ఆకు అల్లిక సమయం లో టార్పాలిన్ పట్టాలు విడిగా వాడాలి అని అన్నారు. గ్రేడింగ్ సమయంలో బుట్టలను అందు కే బాటులో ఉంచుకొని అన్యపదర్దాలను అందులో వేయాలని చెప్పారు. బారన్ లో కురోమీటర్ వాడాలని దీనివలన అగ్ని ప్రమాదాలను నివారించ వచ్చని తెలిపారు. ఇంకా  బ్యారెన్ లో క్యురింగ్ సమయం లో తీసుకోవలసిన మెలుకువలు, జాగ్రత్తలు గురించి తెలియజేశారు. క్యూరింగ్ ల వారీగా పొగాకు మండెలు పెట్టుకోవాలి అని, ఈ సంవత్సరం గ్రేడ్ లు వారీగా మార్కెట్ ఉంటుంది కాబట్టి బేల్స్ కూడా అలానే కట్టుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఐటిసి వేంకటేశ్వర రావు, జిపిఐ మేనేజర్ ఉన్నం శ్రీనివాస రావు, పొగాకు బోర్డు సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)