జీ కే ఎన్ కాలువ వెడల్పు బాధ్యత నేను తీసుకుంటా... ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

bsbnews
0

కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం

- జీ కే ఎన్ కాలువ వెడల్పు బాధ్యత నేను తీసుకుంటా...  ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

- మంచి మనసున్న వ్యక్తి మనకు ఎంపీ గా ఉండటం మన అదృష్టం.

- కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో అన్ని విధాలా అభివృద్ధి.

- కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం -  ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

BSNEWS - గుడ్లూరు











కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గుడ్లూరు మండలంలో టిడిపి,జనసేన,బిజెపిల కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, నెల్లూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ కి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముందుగా పార్టీ నాయకులందరూ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా నాగేశ్వరరావుని గెలిపించిన తర్వాత ఒక్కసారైనా ఖచ్చితంగా వచ్చి, మమ్మల్ని గెలిపించినందుకు  మీ అందరిని చూడాలని కోరికతో ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగిందన్నారు. త్వరలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇలాంటి ఆత్మీయ సమావేశాలు త్వరలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరినట్లుగా గొట్టిపాటి కొండప నాయుడు కెనాల్ వెడల్పు చేసి రాళ్లపాడు ప్రాజెక్టు కు నీరు వచ్చే  బాధ్యతను నేను తీసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల వారు వాటర్ ప్లాంట్ కావాలని కోరారు అని, కచ్చితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే బాధ్యతను వి.పి.ఆర్ ఫౌండేషన్ తీసుకుంటుందని, త్వరలో మా సభ్యులు గ్రామాల్లో పర్యటించి వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని,  ఏర్పాటు చేసిన తర్వాత వాటి పర్యవేక్షణ బాధ్యతను కూడా వి. పి.ఆర్ ట్రస్ట్ ద్వారా చూసుకుంటామని ఆయన తెలిపారు. కందుకూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి, జనసేన, బిజెపి నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం చాలా  సంతోషంగా ఉందని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన నియోజకవర్గంలో ఎలక్షన్  ముందు ప్రజలకు  ఏవైతే హామీలు చెప్పామో అవి నెరవేర్చి ప్రజల మనసులు గెలవాలని ఒక ఆలోచనతో నేడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం తీసుకొచ్చిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన సాగిస్తుందని, గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టి,   ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని  మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మన యువ నాయకులు నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ముఖ్యంగా మన నియోజకవర్గంలో బిపిసిఎల్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా నిరుద్యోగులుగా ఉన్న యువతీ యువకులకు తప్పకుండా ఉపాధి లభిస్తుందని, నియోజకవర్గ పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేశారు. కందుకూరు నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతమని,  నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో రాళ్లపాడు ప్రాజెక్టు ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతుందని, కానీ ప్రస్తుతం రాళ్లపాడు ప్రాజెక్టులో 12 అడుగుల మేర నీరు ఉందని రాబోయే వేసవి కాలంలో నియోజకవర్గంలో నీటి ఇబ్బందులు లేకుండా జీ.కే ఎన్ కాలువ వెడల్పు చేసి  త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎంపీని కోరారు. కందుకూరు నియోజకవర్గంలో కూడా చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నందున వి పి ఆర్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆయన ఎంపీకి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక కూటమి ధర్మాన్ని పాటిస్తూ అందరి సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపటానికి కృషి చేస్తామని తెలిపారు. కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబునాయుడుని నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని వారి నమ్మకానికి తగ్గట్లుగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు వంశీ రెడ్డి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, గుడ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వాడి శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ పాలకుర్తి శంకర్ ఎంపిటిసి చెన్నారెడ్డి వరమ్మ, పార్టీ నాయకులు పువ్వాడి వేణు రావూరి వేణు,  రాఘవులు, పిడికిటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర,పార్లమెంటు, నియోజకవర్గ  అనుబంధ సంఘాల నాయకులు అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళలు భారీ సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)