భవిష్యత్తు నాయక జయహో వర్ధిల్లు నూరేళ్లు

bsbnews
0

భవిష్యత్తు నాయక జయహో వర్ధిల్లు నూరేళ్లు

- నేలపాటి బ్రహ్మయ్య చౌదరి 

BSBNEWS - పొన్నలూరు 


ఏపీ మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని ఆయన నివాసంలో బుధవారం కొండపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ నేలపాటి బ్రహ్మయ్య చౌదరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం కొండపి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకుడు దామచర్ల సత్య అని తెలిపారు. గత నాలుగు రకాలుగా తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ నియోజకవర్గంలో మంత్రి స్వామి గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ దామచర్ల సత్య కింగ్ మేకర్ గా నిలిచారని కొనియాడారు. రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఎలా పనిచేస్తుందో కొండపి నియోజకవర్గంలో డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య లు ఇద్దరు కలిసి అభివృద్ధిలో ముందడుగులు వేయటం మంచి పరిణామం అని అన్నారు. దామచర్ల సత్య నమ్మినవారికి అన్నీ తానై ముందుంటారని, డబుల్ ఇంజన్ సర్కార్ల డబుల్ యాక్షన్ చేసే నాయకులకు తగ్గ గుణపాఠం చెప్పడానికి వెనకాడనన్నారు. నియోజకవర్గంలో ఆ పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేవరకు దామచర్ల కుటుంబం, మంత్రి స్వామి అహర్నిశలు కృషి చేస్తారన్నారు. భావితరాల భవిష్యత్తు నాయకుడు దామచర్ల సత్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ స్వామి దేవస్థానం అర్చకులు స్వయంపాకుల మణికంఠ స్వామి ఆధ్వర్యంలో దామచర్ల సత్యకు శుభాశీస్సులు అందించారు. అనంతరం మణికంఠ స్వామి లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని బహుకరించి దామచర్ల సత్యను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పల్లపోతు వెంకట్రావు, మండవ మాధవ, షేక్ గఫుర్, ఆరికట్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)