సిమెంట్ రోడ్డు నిర్మించాలి

bsbnews
0

 సిమెంట్ రోడ్డు నిర్మించాలి 

BSBNEWS- కందుకూరు 

పట్టణంలోని కోటారెడ్డి నగర్ 9వ వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మించాలని సోమవారం మున్సిపల్ కమిషనర్ కే.అనూష కు సిపిఐ నాయకులు అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పి.మాలకొండయ్య మాట్లాడుతూ కోటారెడ్డి నగర్ లోని అంకమ్మ తల్లి పెట్రోల్ బంకు నుండి గోనుగుంట శివయ్య ఇంటి వరకు సిమెంట్ రోడ్డు నిర్మించాలని అనేకసార్లు మున్సిపల్ అధికారులకు అర్జీలు ఇచ్చినా స్పందన లేదని గతంలో రెండుసార్లు రోడ్ల పనులు ప్రారంభించడానికి కొబ్బరికాయలు కూడా కొట్టారని కానీ ఈ రోడ్డు ఇలానే ఉందని వర్షాకాలంలో మట్టి రోడ్డు నీళ్లు నిలబడి వృద్ధులు పడే పరిస్థితి ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సిమెంట్ రోడ్డు నిర్మించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనంద్ మోహన్, నాయకులు ద్రోణాదుల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)