అంగన్వాడి హెల్పర్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా గుర్తించారు..?

bsbnews
0

 అంగన్వాడి హెల్పర్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా గుర్తించారు..?

 

BSBNEWS- కందుకూరు 


సాధికార సర్వేలో అంగన్వాడి ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు 12వేలు జీతం ఇస్తున్నట్లుగా నమోదు చేసిన దానిని, తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సోమవారం కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హెల్పర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు బి.వరలక్ష్మి, కే. శైలజ, కమతం అనురాధ, సుమ, ఎస్.కే షాహినా మాట్లాడుతూ సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించి, నెలకు 12వేలు జీతం అని నమోదు చేయడం వల్ల, హెల్పర్లుగా మేము తీవ్రంగా నష్టపోయామని సబ్ కలెక్టర్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. హెల్పర్లైన  ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంటు అమలు కావడం లేదని, ఉచిత గ్యాస్, తల్లికి వందనం అమలు కావడం లేదని, మాలో చాలామందికి ఇండ్ల స్థలాలు లేవు అని, పక్కా గృహాలు లేవు అని వీటన్నిటికీ మేము నోచుకోలేకపోతున్నామని, గత ప్రభుత్వ హయాంలోనే  మాకు ఈగతి పట్టిందని, కనీసం ఈ ప్రభుత్వం అయినా, సాధికార సర్వేలో నమోదు చేసిన అంశాలను వెంటనే రద్దు పరచాలని, లేకుంటే నెలకు 12 వేల రూపాయల లెక్కన మాకు రావాల్సిన బకాయిలు వడ్డీలతో సహా చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు జివిబి కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు రోజువారి పనులకు వెళుతూ 500 రూపాయలకు తగ్గకుండా తెచ్చుకుంటున్నారని, కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు ఇదే పనిలో ఉన్న హెల్పర్లకు మాత్రం 230 రూపాయలు రావడం దుర్మార్గం అని, పెరిగిన ధరలతో ఆయా కుటుంబాలు ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాధికార సర్వేలో నమోదు చేసిన దాన్ని రద్దు చేయాలని, లేకుంటే అంగన్వాడి హెల్పర్లు అందరినీ  మార్చి 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని సిఐటియు జిల్లా నాయకులు  హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఉలవపాడు ప్రాజెక్ట్   బి వరలక్ష్మి, కాకర్ల శైలజ, ఎస్కే షాహినా, లోకేశ్వరి, కోటేశ్వరి, బి తెరిసా, గుడ్లూరు నుండి సుమ, ప్రభావతి, ఎస్. కే ఖజాబి, దయమ్మ, కందుకూరు ప్రాజెక్టు  నుండి కమతం అనురాధ, నాదెండ్ల అనిత, ఎస్.కె కరీమా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దువ్వూరి జాన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)