ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

bsbnews
0

 ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్వ

BSBNEWS - VALETEVARIPALEM 

మండలంలోని పోకూరు గ్రామంలో రైతు సేవ కేంద్రం నందు ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ గురువారం పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై రైతులందరూ కూడా ప్రైవేటు దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం వారి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవలసినదిగా సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర సాధారణ రకములు (కామన్) క్వింటా కు 2,300/-రూపాయలు గ్రేడ్ ఏ రకం క్వింటా కు 2320/- రూపాయలు కు కొనుగోలు చేస్తామని తెలిపారు. దానికి కావలసిన నాణ్యత ప్రమాణాలు వ్యర్థ పదార్థాలు, రాళ్లు , మట్టి ఒక శాతం చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన , పురుగు తిన్న ధాన్యం ఐదు శాతం అలాగే తేమశాతం 17 శాతం ఉండాలి అని, ఈ విధంగా ఉన్న ధాన్యాన్ని మద్దతుర చెల్లించి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ పంట నమోదు ఈ కేవైసీ పూర్తయిన రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. కోతకు దగ్గర వచ్చిన రైతులకు షెడ్యూలింగ్ ఇవ్వాల్సినదిగా రైతు సేవ కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి హేమంత్ భరత్ కుమార్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వలేటివారిపాలెం వారి ఆధ్వర్యంలో పోకూరు, అంక భూపాలపురం గ్రామంలో ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. రైతులందరూ కూడా రైతు సేవ కేంద్రం నందు ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. దీనికి ఉచితంగా గోనె సంచులు సరఫరా చేస్తారన్నారు. లేబర్ చార్జీల భారం ప్రభుత్వానిదే రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వానిదే కావున ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కందుకూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ డిప్యూటీ తాసిల్దార్ బ్రహ్మయ్య , పోకూరు గ్రామ రెవెన్యూ అధికారి మనోజ్   పోకూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సీఈఓ మధు, వ్యవసాయ సహాయకులు వై సుష్మ, పి.నాగరాజు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)